ETV Bharat / city

వృద్ధురాలికి నిజామాబాద్ పోలీసుల సర్​ప్రైజ్

author img

By

Published : May 5, 2020, 12:37 PM IST

విధుల్లో కాఠిన్యం ప్రదర్శించే పోలీసులు... ఓ ముసలావిడ జన్మదిన వేడుకలు జరిపి.. ఆనందాన్ని పంచిపెట్టారు. ఫ్రెండ్లి పోలీసింగ్​తో వృద్ధురాలికి పుట్టినరోజును మర్చిపోలేని జ్ఞాపకంగా మార్చారు. ఇంతకీ.. ఆ పోలీసులు ఎక్కడివారు?

Nizamabad police surprise to old lady
వృద్ధురాలికి నిజామాబాద్ పోలీసుల సర్​ప్రైజ్

ఫ్రెండ్లి పోలీసింగ్​తో మరోసారి ఆకట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. నిజామాబాద్​లో ఓ వృద్ధురాలి పుట్టినరోజు వేడుకలు జరిపి ప్రత్యేకత చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్​ కాలనీలో శ్రీకాంత్ రావు, గంగుబాయిలు నివసిస్తున్నారు. వీళ్ళ కూతురు రోహిణి లాక్​డౌన్ కారణంగా హైదరాబాద్​లో ఉండిపోయింది. కరోనా నేపథ్యం కారణంగా నిజామాబాద్ వచ్చి వేడుకలు నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నానని... తన తల్లి జన్మదిన వేడుకలు నిర్వహించాలని పోలీసులకు ఫోన్ చేసి విజ్ఞప్తి చేసింది.

స్పందించిన నిజామాబాద్ రూరల్ ఎస్సై ప్రభాకర్ తన సిబ్బందితో వెళ్లి వృద్ధురాలి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. జన్మదినం సందర్భంగా వారికి పండ్లు అందించి పోలీసుల తరఫున శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల దృశ్యాలను కూతురు రోహిణికి ఫోన్ ద్వారా చూపించారు. పోలీసులు చూపిన ఔదార్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

ఇవీ చూడండి:

రాష్ట్రంలో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.