ETV Bharat / state

కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త - నియామక ప్రక్రియపై హోంమంత్రి ఏమన్నారంటే - POLICE CONSTABLE RECRUITMENT 2024

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

Police Constable Recruitment in AP 2024: గతంలో అర్ధాంతరంగా నిలిపివేసిన కానిస్టేబుల్‌ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నట్లు మంత్రి అనిత వెల్లడించారు. వేర్వేరు కారణాల వల్ల నిలిచిన కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో నియామక పరీక్షను ప్రారంభిస్తున్నామని ప్రక‌టించిన‌ మంత్రి అనితకి మంత్రి నారా లోకేశ్​ ధ‌న్యవాదాలు తెలిపారు.

police_constable_recruitment_exam
police_constable_recruitment_exam (ETV Bharat)

Police Constable Recruitment Exam Started in AP: ఏడాదిన్నర క్రితం నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య (పీఎంటీ,పీఈటీ) పరీక్షలను 5 నెలల్లోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. slprb.ap.gov.in వెబ్​సైట్​​లో పూర్తి వివరాలు ఉన్నాయని మంత్రి అనిత తెలిపారు. రకరకాల కారణాలతో నిలిచిన ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కానిస్టేబుల్ నియామకాలు వాయిదాపడిన విషయం తెలిసిందే.

మంత్రి అనితకు నారా లోకేశ్ ధన్యవాదాలు: అర్ధాంత‌రంగా నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని ప్రక‌టించిన‌ మంత్రి వంగలపూడి అనితకి మంత్రి నారా లోకేశ్​ ధ‌న్యవాదాలు తెలిపారు. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష త‌రువాత రిక్రూట్​మెంట్ 2వ దశలో జ‌ర‌గాల్సిన‌ శారీరక ధారుఢ్య పరీక్షలు వేరువేరు కారణాల‌తో వాయిదా ప‌డ‌టం వ‌ల్ల తాము ప‌డుతున్న ఇబ్బందుల‌ను ప్రజాద‌ర్భార్​కు వ‌చ్చిన నిరుద్యోగులు తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. వీరి విన‌తిని ప‌రిశీలించాల‌ని హోం మంత్రికి పంప‌గా వారు సానుకూలంగా స్పందించి రిక్రూట్​మెంట్ ప్రక్రియ‌లో త‌రువాత ద‌శ‌లు ప్రారంభిస్తామ‌ని ప్రక‌టించారని అన్నారు. ఇది కానిస్టేబుల్ అర్హత ప‌రీక్ష పాసైన నిరుద్యోగుల‌కు చాలా సంతోష‌క‌ర‌మైన స‌మాచారమని మంత్రి లోకేశ్​ పేర్కొన్నారు.

ప్రాథమిక రాత పరీక్షలో 95,208 మంది అర్హత : కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం గత సంవత్సరం జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు విడుదలయ్యాయి. వీరందరికీ ఆ వెంటనే రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించాలి. గతేడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహిస్తామంటూ మొదట షెడ్యూల్‌ విడుదల చేసి హాల్‌టికెట్లూ జారీ చేశారు. చివరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో దానిని వాయిదా వేశారు.

చిక్కులు తొలగితే విలీనానికి మార్గం సుగమం - విశాఖ ఉక్కుపై సర్వత్రా ఆసక్తి - Visakha Steel Merger with SAIL

"దీపావళికి ఆడబిడ్డలకు చంద్రన్న కానుక'' - ప్రతి ఇంటికి, ప్రతి ఎకరాకూ నీళ్లు : సీఎం చంద్రబాబు - Chandrababu Speech at Grama Sabha

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.