దుమ్ముగూడెం కేసు(భారీ ఎత్తున పేలుడు పదార్థాలు రవాణా)లో (NIA filed Charge sheet dummugudem case) ఏడుగురిపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA).. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. మావోయిస్టు నేతలు హిడ్మా, సాంబయ్య, మడకం కాశీలను నిందితులుగా పేర్కొంది. ప్రజాప్రతినిధులతో పాటు పోలీసులపై దాడులు చేసేందుకు మావోయిస్టు నేతలు కుట్రపన్నారని.. దీనికోసం మావోయిస్టు సానుభూతిపరుల సాయంతో పలుసార్లు పేలుడు పదార్థాలను (NIA filed Charge sheet dummugudem case) కొనుగోలు చేశారని ఛార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ పేర్కొంది.
పేలుడు పదార్థాల కోసం మావోయిస్టు నేత హిడ్మా.. పెద్దమొత్తంలో డబ్బులను సానుభూతిపరులకు చెల్లించారని ఎన్ఐఏ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. మావోయిస్టు సానుభూతిపరులు (NIA Charge sheet against seven Maoists) ఫిబ్రవరిలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు కొనుగోలు చేసి పలు వాహనాల్లో అటవీ మార్గంలో హిడ్మాకు, ఇతర మావోయిస్టు నేతలకు చేరవేసేందుకు ప్రయత్నించారని.. ఈ క్రమంలో ఫిబ్రవరి 18న తెలంగాణలోని దుమ్ముగూడెంలో పోలీసులకు పట్టుబడ్డారని ఎన్ఐఏ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది.
ఫిబ్రవరి 18న దుమ్ముగూడెం పోలీసులు కేసు నమోదు చేయగా... మే 2న జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని నాంపల్లి కోర్టుకు సమర్పించిన నేరాభియోగపత్రం (ఛార్జ్‌షీట్)లో (NIA chargesheet on dummugudem case) జాతీయ దర్యాప్తు సంస్థ వివరించింది. ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న నలుగురు మావోయిస్టులు ఇప్పటికే అరెస్టు అయ్యారు. మరో ముగ్గురు మావోయిస్టులు పరారీలో ఉన్నారు.
ఇదీచూడండి: