ETV Bharat / city

హైకోర్టు ఏఎస్​జీ​గా ఎన్​.హరినాథ్​

author img

By

Published : May 20, 2020, 11:47 PM IST

Updated : May 21, 2020, 12:26 PM IST

రాష్ట్ర హైకోర్టుకు ఎన్.హరినాథ్​ను నూతన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్​గా కేంద్రం నియమించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

n.harinath appointed as ap high court assistant solicitor general

ఎన్.హరినాథ్ జనవరి 12,1972లో జన్మించారు. కర్నూలు జిల్లా పాతకోట గ్రామానికి చెందిన హరినాథ్... పాఠశాల విద్యను హైదరాబాద్​లో పూర్తి చేశారు. ఏలూరు సీఆర్​ఆర్ లా కళాశాలలో న్యాయవాద విద్యను అభ్యసించారు. 1994లో న్యాయవాదిగా ఎన్​రోల్ చేసుకున్నారు. అప్పటి నుంచి 2000 సంవత్సరం వరకు సీనియర్ న్యాయవాదుల వద్ద శిక్షణ పొందారు. 2001 నుంచి 2004 వరకు ఉమ్మడి ఏపీ హైకోర్టులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్​గా పనిచేశారు.

2010లో ఉమ్మడి హైకోర్టులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సీనియర్ పానెల్ కౌన్సిల్​గా పనిచేశారు. 2012 లో ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. 2015లో ఎన్​ఐఏకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యారు. 2016లో సీనియర్ పానెల్ కౌన్సిల్ ఫర్ యూనియన్ ఆఫ్ ఇండియా తరఫున తెలంగాణ హైకోర్టులో పనిచేశారు. కంపెనీ, రెవెన్యూ, సర్వీసు, క్రిమినల్, సివిల్ తరహా కేసుల్లో సుధీర్ఘ అనుభవంతో పాటు కేసులపై పట్టు సాధించారు హరినాథ్.

ఇదీ చదవండి:

మమ్మల్ని క్షమించండి: ఎల్జీ పాలిమర్స్​

Last Updated : May 21, 2020, 12:26 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.