జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో.. రాష్ట్రంలో 42 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. కొత్త ప్లాంట్లతో రాష్ట్రంలో కొవిడ్ బాధితులకు మరింత ఎక్కువగా ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: భారత్కు 12 రోజుల్లో 6,738 ఆక్సిజన్ సిలిండర్లు
మదనపల్లె, తాడేపల్లిగూడెం, హిందూపురంలో ఇప్పటికే ప్లాంట్ల పనులు మొదలైనట్లు వెల్లడించారు. అమలాపురంలో రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. మిగతా 38 చోట్ల సామాగ్రి సరఫరాదారుల జాబితా ఖరారైనట్లు చెప్పారు. ఎన్‌హెచ్‌ఏఐ నుంచి ఆదేశాలు వచ్చిన అనంతరం వాటిలోనూ పనులు ప్రారంభిస్తామన్నారు.
ఇదీ చదవండి: