కరోనా వైరస్‌తో ఆస్పత్రుల్లో చేరిన వారిలో ఎవరికైనా జ్వరం వస్తే డిశ్చార్జి చేసేందుకు రెండు వారాల వరకు సమయం పడుతుందని రాష్ట్ర కొవిడ్-19 కమాండ్ కంట్రోల్ రూం ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రభాకరరెడ్డి తెలిపారు.
వైరస్‌తో ఆస్పత్రుల్లో చేరిన వారికి కొందరికి జ్వరం వస్తోంది. ఈ జ్వరంతగ్గి మూడురోజులు దాటినా..14 రోజుల గడువు పూర్తయిన వారినే ఆస్పత్రుల నుంచి ఇళ్లకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.
- జ్వరం, దగ్గు, ఆయాసం ఉన్నా.. ఆక్సిజన్ అవసరం లేకుండా ఉండే వారిని రెండు వారాల అనంతరం డిశ్చార్జి చేస్తారు.
- తీవ్ర అనారోగ్యంతో ఉండి ఆక్సిజన్ అందించినట్లయితే...రెండు వారాల అనంతరం ఆర్టీపీసీఆర్ ద్వారా బాధితుడి నమూనాలు పరీక్షిస్తారు. వైద్యుల సలహాలను అనుసరించి ఈ తరహా డిశ్చార్జిలపై నిర్ణయాలు ఉంటాయి.
- వైరస్ అనుమానిత లక్షణాలతో కొందర్ని ఆస్పత్రులకు తీసుకొస్తున్నారు. వారికి తొలి పరీక్షలోనే నెగిటివ్ వచ్చినట్లయితే వారంరోజుల పాటు స్వీయనియంత్రణలోఉంటే సరిపోతుంది.
- వైరస్‌తో ఆస్పత్రుల్లో చేరిన వారి ఆరోగ్యం నిలకడగా ఉంటే పదిరోజుల అనంతరం పంపించి వేయాలని, మలివిడత పరీక్ష చేయాల్సిన అవసరంలేదని కేంద్రం సూచించింది. అయితే...రాష్ట్ర ప్రభుత్వం మలివిడత నమూనా పరీక్షను వైరాలజీ ల్యాబ్‌లో కాకుండా గంటల వ్యవధిలో రిపోర్టు వచ్చే ట్రూనాట్ ద్వారా చేయించాలని నిర్ణయించింది.
ఇదీ చదవండి: