ETV Bharat / city

New Districts in AP: నూతన జిల్లాలపై మరో ముందడుగు.. నేటి నుంచి సమీక్ష సమావేశాలు - ఏపీ వార్తలు

గత నెలాఖరున ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు, సలహాలు, సూచనలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలు నేటి నుంచి జరగబోతున్నాయి.

New Districts in AP
New Districts in AP
author img

By

Published : Feb 23, 2022, 6:44 AM IST

New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో అడుగుపడింది. గత నెలాఖరున ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు, సలహాలు, సూచనలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలు నేటి నుంచి జరగబోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం అన్ని జిల్లాల్లో కలిపి రెండువేలకుపైగా అర్జీలు అందినట్లు తెలిసింది. 1,478 అభిప్రాయాలు, అభ్యంతరాలు వచ్చినట్లు అధికారికంగా ప్రభుత్వానికి సమాచారం అందింది. ప్రజాప్రతినిధులు, వివిధ ఉద్యోగ, ప్రజాసంఘాల వారు వినతులు ఇస్తున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 700, తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో 16 విజ్ఞప్తులు అందాయి. అభ్యంతరాల స్వీకరణకు వచ్చే నెల 3 దాకా గడువున్నా.. ముందుగానే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుండటం చర్చనీయాంశమైంది. ఏప్రిల్‌ 2 నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించేలా సన్నాహాలు సాగుతున్నాయి.

నాలుగు సమావేశాలు...

13 జిల్లాల కలెక్టర్లతో బుధవారం నుంచి ఈ నెల 28 మధ్య 4 రోజులు విజయవాడ, తిరుపతి, అనంతపురం, విశాఖపట్నం నగరాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. విజ్ఞప్తుల గురించి ఈ సమావేశాల్లో జిల్లాల కలెక్టర్లు వివరించాలని రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్‌ ఆదేశాలు జారీచేశారు. 23న విజయవాడలో... కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో, 24న తిరుపతిలో... చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో, 26న అనంతపురంలో... అనంతపురం, కర్నూలు జిల్లాల కలెక్టర్లతో, 28న విశాఖపట్నంలో... విశాఖపట్నం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు ఉంటాయి.

హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ..

అనంతపురం జిల్లాలో 700 వరకు విజ్ఞప్తులొచ్చాయి. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ 350 విజ్ఞప్తులు అందాయి. ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ ప్రకటించాలని 330 వినతులొచ్చాయి. పెనుకొండను జిల్లా కేంద్రం చేయాలని 3, రామగిరి మండల కేంద్రాన్ని అనంతపురం డివిజన్‌లో కలపాలని 3 విజ్ఞప్తులు అందాయి.

అనకాపల్లి జిల్లాను కోరుతూ...

విశాఖపట్నంలో 245 అర్జీలొచ్చాయి. నర్సీపట్నం కేంద్రంగా అనకాపల్లి జిల్లాను ఏర్పాటు చేయాలంటూ 72 మంది ఆకాంక్షను వెలిబుచ్చారు. అనకాపల్లి జిల్లాలో పెందుర్తి నియోజకవర్గాన్ని కలపొద్దని విశాఖలోనే ఉంచాలని కోరుతున్నారు. అరకు కేంద్రంగా అల్లూరి జిల్లాను ఏర్పాటుచేయాలని, రంపచోడవరాన్ని అల్లూరి జిల్లాలో కలపొద్దని, మైదాన ప్రాంతంలోని షెడ్యూల్‌ ప్రాంతాలను అల్లూరి జిల్లాలో కలపాలని డిమాండ్లున్నాయి.

‘కృష్ణా’కు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని...

కృష్ణా జిల్లాలో 37 అభ్యర్థనలు అందాయి. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్‌ జిల్లాలో కలపాలని, అవనిగడ్డ, కంకిపాడు, మైలవరం మండలాలను రెవెన్యూ డివిజన్‌లుగా చేయాలని కోరారు. విజయవాడకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని.. ఇప్పటికే విజయవాడకు పెట్టిన ఎన్టీఆర్‌ పేరును కృష్ణా జిల్లాకు మార్చాలని కోరుతున్నారు.

పేర్లు మార్చాలంటూ...

గుంటూరు జిల్లాలో... గురజాలను పల్నాడు జిల్లా కేంద్రం చేయాలని, జాషువా పేరునూ జత చేయాలనే విన్నపంతో వందల సంఖ్యలో అర్జీలొచ్చాయి. బాపట్ల జిల్లాకు భావపురి పేరు పెట్టాలని కోరారు. పెదకూరపాడు-సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలంటూ వినతిపత్రాలిచ్చారు. అమరావతి కేంద్రంగా రాజధాని ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని అఖిల భారత పంచాయతీ పరిషత్తు జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు విన్నవించారు.

‘మెంటాడ’ను విజయనగరంలో ఉంచాలి

విజయనగరం జిల్లాలో 42 విజ్ఞప్తులందాయి. మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో కొనసాగించాలని.. ఐదారు గిరిజన గ్రామాల వారు మాత్రం మన్యంలో చేర్చాలంటున్నారు. మన్యం పేరు కాకుండా పార్వతీపురం పేరును కొనసాగించాలని లేకపోతే పార్వతీపురం మన్యం అని పెట్టాలంటున్నారు. శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖలో కలపాలని కోరుతున్నారు.

పార్వతీపురం కేంద్రంగా...

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో ఐటీడీఏ ఏర్పాటుచేయాలని ఎక్కువ విజ్ఞప్తులొచ్చాయి. ప్రస్తుతం రాజాం నియోజకవర్గంలో ఉన్న వంగర మండలం కొత్తగా ఏర్పాటుకానున్న విజయనగరం జిల్లాలో కలవనుంది. వంగర మండలాన్ని శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచాలని విజ్ఞప్తులు వచ్చాయి. పాలకొండ కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటుచేయాలని స్థానికులు కోరుతున్నారు.

రంపచోడవరం డివిజన్‌ను...

తూర్పుగోదావరి జిల్లాలో 130 అర్జీలు అందాయి. రంపచోడవరం డివిజన్‌నుజిల్లాగా ప్రకటించాలని... పెదపూడి, తాళ్లరేవు మండలాలను కాకినాడలో కలపాలని... మండపేట, గోకవరం మండలాలను రాజమహేంద్రవరంలో ఉంచాలని కోరుతున్నారు. కాకినాడ జిల్లాకు పిఠాపురం మహారాజా, మల్లాడి సత్యలింగనాయకర్‌, అన్నవరం సత్యనారాయణ స్వామి పేరు పెట్టాలని, అమలాపురం జిల్లాకు కోనసీమ, అంబేడ్కర్‌, డొక్కా సీతమ్మ, జీఎంసీ బాలయోగి, సర్‌ఆర్థర్‌ కాటన్‌ పేర్లు.. రాజమహేంద్రవరం జిల్లాకు పుష్కర గోదావరి, సర్‌ఆర్థర్‌ కాటన్‌, కందుకూరి వీరేశలింగం పంతులు పేర్లు పెట్టాలని వినతులిచ్చారు.

నరసాపురాన్నే జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

పశ్చిమగోదావరి జిల్లాలో 60 అర్జీలొచ్చాయి. భీమవరం జిల్లా కేంద్రంగా కొత్తగా ఏర్పడనున్న పశ్చిమగోదావరి జిల్లాపై 25 విజ్ఞప్తులు అందాయి. నరసాపురాన్నే జిల్లా కేంద్రంగా చేయాలనేది వీటి సారాంశం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలను రాజమండ్రి జిల్లాలో కలపడంపై 25కు పైగా అభ్యంతరాలొచ్చాయి. దాన్ని ఏలూరు జిల్లాలోనే కొనసాగించాలని కోరుతున్నారు. పోలవరాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో 150

ప్రకాశం జిల్లాకు సంబంధించి 150 వినతులు అందాయి. కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపకుండా... ఒంగోలు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్లు వస్తున్నాయి. మార్కాపురాన్ని ప్రత్యేకంగా జిల్లాగా ప్రకటించాలని ఉద్యమం సాగుతోంది.

మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలి

చిత్తూరు జిల్లాలో 148 అభ్యంతరాలొచ్చాయి. మదనపల్లె జిల్లాను ఎక్కువ మంది కోరుతున్నారు. పీలేరు, మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లెను కలిపి కొత్త జిల్లాగా ప్రకటించాలని, శ్రీకాళహస్తిని రెవెన్యూ డివిజన్‌ చేయాలని, నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో, గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని డిమాండ్లున్నాయి.

* కొత్త జిల్లాల ఏర్పాటుపై 58 అభ్యంతరాలు, 4 సలహాలు కడప జిల్లా అధికారులకు అందాయి. వీటిలో రాజంపేట కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలనేవే ఎక్కువ. దీనిపై ఉద్యమమూ నడుస్తోంది.

ఇదీ చదవండి: CAG ON AP: బడ్జెట్‌ అనుమతులు లేకుండా చేసిన ఖర్చు 94,399 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.