ETV Bharat / city

రాష్ట్రానికి నీలం సాహ్ని... సీఎస్​గా నియామకానికి మార్గం సుగమం

రాష్ట్రానికి సీఎస్​గా నీలం సాహ్ని రావటానికి మార్గం సుగమం అయింది. ఆమెను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సీఎస్​గా వచ్చేందుకు నీలం సాహ్నికు మార్గం సుగమం
author img

By

Published : Nov 12, 2019, 6:32 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని నియామకానికి మార్గం సుగమం అయింది. ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారశాఖ కార్యదర్శిగా ఉన్న ఆమెను ఆ విధుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర నియామకాల కేజినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 1984 బ్యాచ్ ఏపీకేడర్​కు చెందిన నీలం సాహ్ని ఇదివరకు కేంద్ర విజిలెన్స్ కమిషన్ కార్యదర్శిగానూ సేవలందించారు. 1960 జూన్ 20న జన్మించిన ఈమె వచ్చే ఏడాది జూన్ వరకు పదవిలో కొనసాగనున్నారు. భర్త అజయ్​సాహ్ని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి: సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్ష

Intro:Body:

cs eenadu

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.