జగన్ ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మరోసారి ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. బీసీ నిధులు పక్కదారి పట్టించారని అన్నందుకే అచ్చెన్నాయుడిపై దుష్ప్రచారం మొదలుపెట్టారని పేర్కొన్నారు. ఔషధాల కొనుగోలుకు అచ్చెన్నాయుడు లేఖలు రాయలేదని ఆధారాలు ఉన్నాయని వివరించారు.