చంద్రబాబు హయాంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదంటూ అసత్యాలు ప్రచారం చేసిన సీఎం జగన్... ఇప్పుడు నిజాలు బయటపెడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ మాట్లాడుతూ... తెదేపా హయాంలో 9 లక్షల 56 వేల 263 ఉద్యోగాలు ఇచ్చారనే నిజాన్ని ఒప్పుకున్న విషయం గుర్తుచేశారు.
'ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్' పేరుతో వైకాపా ప్రభుత్వం రూపొందించిన పథకంలో.. తెదేపా హయాంలో 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 3.51 లక్షల ఉద్యోగాలు ఒక్క ఉత్పత్తి రంగంలోనే వచ్చినట్లు ప్రకటించారని గుర్తుచేశారు. ఇవన్నీ వైకాపా ప్రభుత్వంలాగా కార్యకర్తలకు దొడ్డిదారిలో ఇచ్చిన ఉద్యోగాలు కావని.. నిరుద్యోగ యువతకు బాబు ఇచ్చిన జాబులని లోకేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఇవీ చదవండి.. సీఎం జగన్కు జైలు భయం పట్టుకుంది: నారా లోకేశ్