ముఖ్యమంత్రి జగన్పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. అవినీతిపరుడైన జగన్‌కు లోకమంతా అవినీతి కనపడటంలో ఆశ్చర్యం లేదన్నారు. దేశంలో 40 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తే రూ.85 లక్షలు దొరికాయని.. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో రూ.2 వేల కోట్లు దొరికాయని వైకాపా ఎలా చెబుతుందని నిలదీశారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ అదేదో గొప్ప పని అనుకుంటున్నారని మండిపడ్డారు. జగన్‌కు జైలు భయం పట్టుకుందని.. అందుకే ఐటీ దాడులను తెదేపాకు ముడిపెట్టాలని తాపత్రయపడుతున్నారని ధ్వజమెత్తారు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి తనలాగే అందరూ జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి.. 'అక్రమాస్తుల కేసుల్లో జగన్‌కు శిక్ష ఖాయం'