Lokesh On CPS: మాట మార్చుడు, మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్గా జగన్ రెడ్డి మారారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. నాడు ఉద్యోగుల ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్న మాటకి రెండున్నరేళ్లు అయినా దిక్కు లేదని ఎద్దేవా చేశారు. పైగా జగన్ కు అవగాహన లేకే సీపీఎస్ రద్దు చేస్తామనే హామీ ఇచ్చారంటూ స్వయంగా సలహాదారుడు సజ్జల ప్రకటించడం ఉద్యోగులని దారుణంగా మోసగించడమేనని స్పష్టం చేశారు. నెరవేర్చని హామీలిచ్చి వంచించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. ఉద్యోగులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు ఉద్యోగులు చేస్తోన్న పోరాటానికి తెదేపా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందన్నారు. ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేని తేల్చి చెప్పారు.
-
నాడు ఉద్యోగుల ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారు. నేడు మాట మార్చుడు, మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు @ysjagan. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్న మాటకి రెండున్నరేళ్ళు అయినా దిక్కు లేదు.(1/3) pic.twitter.com/bxmDSRiZiw
— Lokesh Nara (@naralokesh) December 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">నాడు ఉద్యోగుల ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారు. నేడు మాట మార్చుడు, మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు @ysjagan. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్న మాటకి రెండున్నరేళ్ళు అయినా దిక్కు లేదు.(1/3) pic.twitter.com/bxmDSRiZiw
— Lokesh Nara (@naralokesh) December 14, 2021నాడు ఉద్యోగుల ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారు. నేడు మాట మార్చుడు, మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు @ysjagan. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్న మాటకి రెండున్నరేళ్ళు అయినా దిక్కు లేదు.(1/3) pic.twitter.com/bxmDSRiZiw
— Lokesh Nara (@naralokesh) December 14, 2021
ఇదీ చదవండి:
AP Employees Union Leaders: '55 శాతం ఫిట్‌మెంట్ ఇస్తేనే అంగీకరిస్తాం'
Sajjala On Fitment to Govt Employees: సీఎస్ కమిటీ సిఫారసు చేసిన ఫిట్‌మెంట్ పెంచే అవకాశం: సజ్జల