ఈ నెల 11న తెదేపా తలపెట్టిన ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉద్ఘాటించారు. ప్రజలందరికీ అండగా ఉండాల్సిన ప్రభుత్వం...నిస్సిగ్గుగా వైకాపా రౌడీలను ప్రోత్సహిస్తుంటే ఊరుకునేదిలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పల్నాడులో దాడులకు గురైన తెదేపా కార్యకర్తలకు న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగిస్తామని ట్విటర్లో వెల్లడించారు. పల్నాడులో సాధారణ పరిస్థితులు ఉన్నాయని హోం మంత్రి సుచరిత అంటుంటే... 144 సెక్షన్ ఉందని డీజీపీ పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో ఎవరి మాటలు మనం నమ్మాలి అని ప్రశ్నించిన అయన... ఎవరిని మభ్యపెట్టేందుకు ఇలాంటి అవాస్తవ ప్రకటనలు చేస్తున్నారంటూ ట్విటర్ ద్వారా నిలదీశారు.
ఇవీ చూడండి