ETV Bharat / city

తెదేపా అనుబంధ సంఘాల్లో మహిళలకే ప్రాధాన్యం:లోకేశ్ - amaravathi

వచ్చే నెలలో వేయనున్న తెదేపా అనుబంధసంఘాల కార్యవర్గాలు ఎలా ఉండాలనే దానిపై నారా లోకేశ్ సమావేశం నిర్వహించారు. తెలుగు యువత, విద్యార్థి, మహిళా సంఘాల కార్యవర్గాలలో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి అన్ని సంఘాలకు పూర్తి రాష్ట్ర కార్యవర్గాలు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

తెదేపా అనుబంధ సంఘాల్లో మహిళలకే ప్రాధాన్యం:లోకేశ్
author img

By

Published : Aug 28, 2019, 11:42 PM IST

మహిళలు, యువత, విద్యార్థులకు అండగా నిలవడమే లక్ష్యంగా అనుబంధ సంఘాలు పనిచేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచించారు. తెదేపా అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తున్నామని, సెప్టెంబర్ నెలాఖరు నాటికి అన్ని సంఘాలకు పూర్తి రాష్ట్ర కార్యవర్గాలు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. తెదేపా రాష్ట్ర కార్యాలయంలో తెలుగు యువత, టీఎన్ఎస్ ఎఫ్, తెలుగు మహిళ సంఘాల ప్రతినిధులతో లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనుబంధ సంఘాల పనితీరు, బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత గురించి చర్చించారు.

మహిళలకే ప్రాధాన్యం...
వచ్చే నెలలో వేయనున్న అనుబంధసంఘాల కార్యవర్గాలు ఎలా ఉండాలనే దానిపై సమావేశంలో చర్చించారు. టీఎన్ఎస్ఎఫ్ లో సభ్యులుగా చేరాలన్నా, కార్యవర్గంలో ఉండాలన్నా తప్పనిసరిగా విద్యార్థి అయి ఉండాలని లోకేష్ నిర్దేశించారు. వయస్సు 35కి మించని వారే టీఎన్ఎస్ఎఫ్​లో చేరేందుకు అర్హులని నిర్ణయించారు. తెలుగు యువత, విద్యార్థి, మహిళా సంఘాల కార్యవర్గాలలో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వినూత్నమైన పోరాట పంథాతో ప్రజాసమస్యలపై ఉద్యమించాలని కోరారు.

తెదేపా అనుబంధ సంఘాల్లో మహిళలకే ప్రాధాన్యం:లోకేశ్

ఇవీ చూడండి-అన్యాయాన్ని ప్రశ్నిస్తే... అక్రమ కేసులా..?

Intro:ap_cdp_17_28_gutka_swadenam_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
నిషేధిత గుట్కా బస్తాలను అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు నిందితులను కడప పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి తొమ్మిదిన్నర లక్షల విలువచేసే గుట్కా బస్తాలను, 15 లక్షల విలువ చేసే రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని కడప డిఎస్పి సూర్యనారాయణ మీడియా ఎదుట హాజరుపరిచారు.. కడప కు చెందిన ఆరుగురు వ్యక్తులు బెంగళూరు నుంచి నిషేధిత గుట్కా బస్తాలను రెండు వాహనాల్లో తీసుకువస్తున్నట్లు సమాచారం రావడంతో చింతకొమ్మదిన్నె మండలం పబ్బ పురం వద్ద నిఘా ఉంచారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు వాహనాల్లో తొమ్మిదిన్నర లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా బస్తాలు ఉన్నాయి. ఈ మేరకు వాటిని స్వాధీనపరచుకొని ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిషేధిత గుట్కాలను ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని డి.ఎస్.పి హెచ్చరించారు.
byte:సూర్యనారాయణ, డిఎస్పి, కడప.

Body:గుట్కాలు స్వాధీనం

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.