Nara Lokesh: రాజధానిపై హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం... సుప్రీంకోర్టుకు వెళ్లిన అంశంపై లోకేశ్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. అధర్మం అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినా... అంతిమ విజయం న్యాయానిదేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టంచేశారు.
-
అధర్మం అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళినా అంతిమ విజయం న్యాయానిదే.
— Lokesh Nara (@naralokesh) September 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">అధర్మం అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళినా అంతిమ విజయం న్యాయానిదే.
— Lokesh Nara (@naralokesh) September 17, 2022అధర్మం అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళినా అంతిమ విజయం న్యాయానిదే.
— Lokesh Nara (@naralokesh) September 17, 2022
ఇదీ జరిగింది: రాష్ట్రానికి అమరావతే రాజధాని అని 6 నెలల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 3 రాజధానులు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అమరావతే రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనన్న రాష్ట్ర ప్రభుత్వం తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని కోరింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదనడం సరికాదని సీఆర్డీఏ చట్టం ప్రకారమే చేయాలనడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని పిటిషన్‌లో పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే 3 రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పిటిషన్‌లో తెలిపింది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించిందని... అది రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఇవీ చదవండి: