తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థి.. కెనడాలో ఆత్మహత్య చేసుకున్నాడు. డిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్‌రావు.. ఉన్నత చదువుల కోసం 2015లో కెనడాకు వెళ్లాడు. ఇవాళ ఉదయం భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఉదయం మిత్రుల ద్వారా తల్లిదండ్రులకు విషయం తెలిసింది. ప్రవీణ్‌రావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియదని కుటుంబీకులు తెలిపారు. ఉన్నత చదువులు చదివి.. గొప్పవాడు అవుతాడనుకుంటే.. ఇలా అర్థాంతరంగా వెళ్లిపోయాడని కన్నీటిపర్యంతమయ్యారు. తమ కుమారుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: