చలో ఆత్మకూరుతో వైకాపా దురాగతాలను తెదేపా.. జాతీయస్థాయికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చేసిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. 100 రోజుల వైకాపా పాలన లోపాలను ఎత్తిచూపడంలో తెదేపా నైతిక విజయం సాధించందన్నారు. అమరావతిలో మాట్లాడిన ఆయన... మంత్రి బొత్స సత్యనారాయణ పూటకోరకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో బొత్స... జగన్, షర్మిలను విమర్శించారని గుర్తుచేశారు. మంత్రి మాటలు అర్థం కాక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారన్నారు. దేశం మొత్తం చర్చించుకున్న ఆత్మకూరు ఘటనలను మంత్రి బొత్స చిన్న సంఘటనలు అనడం విడ్డూరంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధితులను పెయిడ్ ఆర్టిస్టులన్న వైకాపా నేతలు.. రెవెన్యూ అధికారులు, పోలీసులు చర్చలు జరిపి బాధితులను స్వగ్రామాలకు ఎందుకు తీసుకెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. ఆత్మకూరు దాడులపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: