హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మికనగర్‌లో జరిగిన హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న అలీని పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు సిద్దిక్ అహ్మద్ భార్య రూబిన్ను విచారించగా అసలు విషయం బయటపడింది. అలీతో ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే ఇద్దరూ కలిసి సిద్దిఖ్ అహ్మద్‌ను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.
'హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని బయటకు తీసుకు వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. మృతదేహాన్ని ముక్కలు చేయాలని భావించారు. కుదరక పోవడం వల్ల.. ఎవరికీ అనుమానం, దుర్వసన రాకుండా ఫ్రిజ్‌లో పెట్టి పెట్టేందుకు యత్నించారు. అదీ సాధ్యం కాకపోవడం వల్ల తెల్లవారు జాము వరకూ వేచి చూసి నాలుగున్నర ప్రాంతంలో అక్కడి నుంచి పరారైనట్లు' పోలీసుల దర్యాప్తులో తేలింది.
దుర్వసన రావడం వల్ల పక్కింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. మృతుని ద్విచక్ర వాహనంపైనే నిందితులిద్దరూ వెళ్లినట్లు గుర్తించారు. సాంకేతికత ఆధారంగా మెహదీపట్నం ప్రాంతంలో అలీని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో అలీ ఉన్నాడు.
ఇవీ చూడండి: