ETV Bharat / city

పురపాలికల్లో ప్రచార హోరు... రంగంలోకి దిగిన ప్రజాప్రతినిధులు

author img

By

Published : Mar 6, 2021, 4:16 AM IST

మున్సిపాల్టీల్లో అభ్యర్థులు పోటాపోటీ ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ప్రచారానికి ఇక మూడురోజులే మిగిలిన వేళ.. పోటీదారులు జోరు పెంచారు. ఇంటింటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

municipal elections campaign
పురపాలికల్లో ప్రచార హోరు

పురపాలక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రచారం జోరందుకుంది. తెదేపా అభ్యర్థుల తరపున మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి వార్డుల్లో ప్రచారానికి వచ్చారు.

రంగంలోకి ప్రజాప్రతినిధులు...

అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెదేపా నేత కాలవ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కల్యాణదుర్గంలో ఓట్లు కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. 18వ వార్డులో వైకాపా అభ్యర్థి ప్రజల కాళ్లకు దండం పెట్టి ఓట్లు అభ్యర్థించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఎమ్మెల్యే రోజా.. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తమ అభ్యర్థులను గెలిపించాలంటూ.. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి రంగంలోకి దిగారు. కడప, ప్రకాశం జిల్లాల్లో వైకాపా, భాజపా నాయకులు నువ్వానేనా అన్నట్లు ప్రచారాలు చేశారు. చీరాలలో వైకాపా తరఫున మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగారు.

విమర్శనాస్త్రాలు...

నవరత్నాలకు ఓట్లు పడతాయని నమ్మకం లేకే... వైకాపా ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బెదిరింపు రాజకీయాలు చేస్తోందని .. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఎన్నికల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు.. తెనాలి ఎన్నికల ప్రచారంలో మండిపడ్డారు.

ఉత్తరాంధ్రలో...

విశాఖ జిల్లా నర్సీపట్నంలో పర్యటించిన భాజపా నేత జీవీఎల్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలంటే ఓ వ్యాపారం అయిపోయిందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, పాలకొండలో పోటాపోటీగా ప్రచారాలు చేసుకుంటూ నేతలు దూసుకుపోతున్నారు. ఎమ్మెల్యే అశోక్, ఎంపీ రామ్మోహన్నాయుడు, తెదేపా నేత కూన రవికుమార్.. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. వాళ్లకు పోటీగా మంత్రి అప్పలరాజు రంగంలోకి దిగారు.

కృష్ణా, గుంటూరుల్లో...

నందిగామ లో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని గుంటూరు జిల్లా వినుకొండ అధికారులు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

అగ్నిప్రమాదంలో 10 పూరిళ్లు దగ్ధం.. 12 గొర్రెలు సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.