ETV Bharat / city

తెలంగాణ: రేపే పోలింగ్ ....పుర ఎన్నికలకు సర్వం సిద్ధం - Muncipal_Polling

ఒక్క టెండర్ ఓటు పడినా అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తామని తెలంగాణా రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి పోలింగ్ నిర్వహిస్తున్నామన్న ఎస్ఈసీ... ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నికల్లో ధన ప్రవాహం లేకుండా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఇతరులు మరింత చురుకైన పాత్ర పోషించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కోరారు.

రేపే పోలింగ్ ....పుర ఎన్నికలకు సర్వం సిద్ధం
muncipal-polling-in-telangana
author img

By

Published : Jan 21, 2020, 10:50 PM IST

రేపే పోలింగ్ ....పుర ఎన్నికలకు సర్వం సిద్ధం

రేపు జరగనున్న పురపాలక ఎన్నికల పోలింగ్ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణా రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుందని... ఓటింగ్ సాఫీగా సాగేలా అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించింది. తొమ్మిది నగర పాలకసంస్థల్లోని 324 డివిజన్లు, 120 పురపాలక సంస్థల్లోని 2,647 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. కార్పొరేషన్లలో 1,746 మంది, మున్సిపాలిటీల్లో 11,099 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 12,845 మంది అభ్యర్థులు రేపటి పోలింగ్​లో ప్రజల తీర్పు కోరనున్నారు. ఇందుకోసం నగరపాలక సంస్థల్లో 1,438, పురపాలక సంస్థల్లో 6,188 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

కొంపల్లిలో ప్రయోగాత్మకంగా...

కార్పొరేషన్లలో 13లక్షల13వేల 909 మంది, మున్సిపాలిటీల్లో 40 లక్షల 36వేల 346 మంది ఓటర్లున్నారు. కరీంనగర్​ను మినహాయిస్తే 50 లక్షలకు పైగా ఓటర్లు రేపు ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. పోలింగ్ కోసం 45వేల సిబ్బందిని వినియోగిస్తున్నారు. 50వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 2,406 పోలింగ్ కేంద్రాల్లో వెబ్​కాస్టింగ్, 2,072 చోట్ల వీడియోగ్రఫీ ఏర్పాట్లు చేశారు. 2,053 పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఓటర్ల గుర్తింపు కోసం కొంపల్లి పురపాలిక పరిధిలోని పది పోలింగ్ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఫేసియల్ రికగ్నైజేషన్ యాప్​ను ఉపయోగిస్తున్నారు.

డబీర్​పురా డివిజన్​లోనూ...

జీహెచ్ఎంసీ పరిధిలోని డబీర్ పురా డివిజన్​లోనూ ఉప ఎన్నికల పోలింగ్ రేపే జరగనుంది. అక్కడ 50వేల 275 మంది ఓటర్లు ఉండగా... 66 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ చేయనున్నారు.

ఇవీ చూడండి: ఒక్క టెండర్ ఓటు నమోదైనా రీపోలింగ్: నాగిరెడ్డి

File : TG_Hyd_54_21_Muncipal_Polling_Pkg_3053262 From : Raghu Vardhan Note : Feed from 3G Kit ( ) ఒక్క టెండర్ ఓటు పడినా అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎంతో వ్యయప్రయాసలకోర్చి పోలింగ్ నిర్వహిస్తున్నామన్న ఎస్ఈసీ... ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నికల్లో ధనప్రవాహం లేకుండా రాజకీయపార్టీలు, అభ్యర్థులు, ఇతరులు మరింత చురుకైన పాత్ర పోషించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కోరారు...లుక్ వాయిస్ ఓవర్ - 01 రేపు జరగనున్న పురపాలక ఎన్నికల పోలింగ్ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు పోలింగ్ జరుగుతుందని... ఓటింగ్ సాఫీగా సాగేలా అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించింది. తొమ్మిది నగర పాలకసంస్థల్లోని 324 డివిజన్లు, 120 నగరపాలకసంస్థల్లోని 2647 వార్డుల పదవులకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. కార్పోరేషన్లలో 1746 మంది, మున్సిపాల్టీల్లో 11099 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 12,845 మంది అభ్యర్థులు ఇవాళ్టి పోలింగ్ లో ప్రజల తీర్పు కోరనున్నారు. ఇందుకోసం నగరపాలక సంస్థల్లో 1438, పురపాలక సంస్థల్లో 6188 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్పోరేషన్లలో 13లక్షలా 13వేలా 909 మంది, మున్సిపాల్టీల్లో 40 లక్షలా 36వేలా 346 మంది మొత్తం 53 లక్షలా 50వేలా 255 మంది ఓటర్లున్నారు. కరీంనగర్ ను మినహాయిస్తే 50 లక్షలకు పైగా ఓటర్లు రేపు ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. పోలింగ్ కోసం 45వేల సిబ్బందిని వినియోగిస్తున్నారు. 50వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 2406 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, 2072 చోట్ల వీడియోగ్రఫీ ఏర్పాట్లు చేశారు. 2053 పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఓటర్ల గుర్తింపు కోసం కొంపల్లి పురపాలిక పరిధిలోని పది పోలింగ్ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ ను ఉపయోగిస్తున్నారు. బైట్ - వి.నాగిరెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాయిస్ ఓవర్ - 02 ఎన్నికల్లో ధనప్రవాహం లేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి... పెద్దపల్లిలో డబ్బులు పంచుతూ దొరికిన అభ్యర్థిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ లోనూ డబ్బులు పంచుతున్నట్లు ఫిర్యాదు అందిందని చెప్పారు. ధన ప్రవాహాన్ని అరికట్టేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మరింతగా చొరవ చూపాలని నాగిరెడ్డి కోరారు. డబ్బులు పంచిన అభ్యర్థి ఎన్నికల్లో గెలిస్తే పదవి కోల్పోవచ్చని... ఎన్నికల ఖర్చు సరిగ్గా చూపకపోతే వారి పదవులను ఎన్నికల సంఘమే రద్దు చేయవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 44 లక్షల రూపాయలకు పైగా నగదు, 16 లక్షల రూపాయల విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. బైట్ - వి. నాగిరెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాయిస్ ఓవర్ - 03 ప్రతి ఒక్కరూ విధిగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్... మంచి వ్యక్తులను ఎన్నుకుంటేనే సమస్యలు తీరతాయని తెలిపారు. పెద్ద వ్యాపారాలు, డబ్బున్న వారు అందుబాటులో ఉంటారో... లేదో... అన్న విషయం ఆలోచించుకోవాలని సూచించారు. మెజార్టీలు పదుల్లోనే ఉండే అవకాశం ఎక్కువగా ఉందని... చాలా వార్డుల్లో వందల మంది ఓటు వేయడం లేదని నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. దురదృష్టవశాత్తూ మీ ఓటు ఎవరైనా వేస్తే నిరాశ చెందవద్దని... టెండర్ ఓటు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఒక్క ఓటు టెండర్ ఓటు పడినా రీపోలింగ్ తప్పనిసరిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బైట్ - వి.నాగిరెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎండ్ వాయిస్ ఓవర్ - ఉపఎన్నిక జరుగుతోన్న జీహెచ్ఎంసీ పరిధిలోని డబీర్ పురా డివిజన్ లోనూ రేపే పోలింగ్ జరగనుంది. అక్కడ 50వేలా 275 మంది ఓటర్లు ఉండగా... 66 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ చేయనున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.