ETV Bharat / city

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు పూర్తి.. ఎవరి వాదన ఏంటంటే..! - high court latest updates

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్​లో ఉంచింది. ప్రభుత్వంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు తమను ఇంప్లీడ్ చేసుకోవాలని పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. జనసేన పార్టీ తరఫున న్యాయవాది వేణుగోపాల రావు, ఎస్​ఈసీ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు పూర్తి

author img

By

Published : Aug 5, 2021, 5:10 PM IST

Updated : Aug 5, 2021, 5:26 PM IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో ఇరు వైపులా వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పు రిజర్వ్​లో ఉంచింది. పరిషత్ ఎన్నికలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్​లో అప్పీల్ దాఖలు చేసింది. ప్రభుత్వంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు తమను ఇంప్లీడ్ చేసుకోవాలని పిటిషన్లు దాఖలు చేశారు.
అన్ని పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. జనసేన పార్టీ తరపున న్యాయవాది వేణుగోపాల రావు, ఎస్​ఈసీ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఈ యేడాది మే లో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు.

పరిషత్ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ జారీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్​కు నాలుగు వారాల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని సింగిల్ జడ్జి అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచామని.. వాటి భద్రతకు భారీగా ఖర్చు అవుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పారు.

జనసేన వేసిన పిటిషన్ లో ఎన్నికలకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి అనే అంశం ప్రస్తావించలేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. గతంలో డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలతోనే ఎన్నికలను నిర్వహించామని ఎస్​ఈసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకుని ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అనుమతించాలని ధర్మాసనాన్ని కోరారు. తాము ఎన్నికలకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలనే అంశంపై గతంలో సింగిల్ జడ్జి ముందు వాదనలు వినిపించామని జనసేన పార్టీ తరపు న్యాయవాది డివిజన్ బెంచ్ కు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది.

ఇదీ చదవండి:

devineni uma released: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి.. దేవినేని ఉమా విడుదల

Last Updated : Aug 5, 2021, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.