ETV Bharat / city

'కేంద్ర బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉంది' - vijayasai reddy on central budjet

కేంద్ర బడ్జెట్‌ ఏపీకి శరాఘాతంగా ఉందని వైకాపా ఎంపీలు అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. సామాజిక సంక్షేమ పథకాల్లో కేంద్ర బడ్జెట్‌లో పురోగతి లేదన్నారు.

mp vijaya sai reddy dissatisfaction over central budget

author img

By

Published : Feb 1, 2021, 3:10 PM IST

కేంద్రబడ్జెట్​పై మాట్లాడుతన్న ఎంపీ విజయసాయి రెడ్డి

కేంద్ర బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి మొండిచెయ్యి చూపారని అసహనం వ్యక్తం చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల ప్రయోజనాలు తప్ప.. దేశంలో మిగిలిన రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు.

విశాఖ, విజయవాడకు మెట్రో ప్రస్తావనే లేదని.. పోలవరం ప్రస్తావనా రాలేదని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టు ఒక్కటీ లేదని నిరాశ వ్యక్తం చేశారు. కేంద్రం ప్రత్యేక హోదాపై భాజపా శ్రద్ధ పెట్టడం లేదన్నారు. అభివృద్ధి దిశ బడ్జెట్ కావాలి కానీ.. సర్వైవల్ బడ్జెట్ కాదని హితవు పలికారు. సామాజిక సంక్షేమ పథకాల్లో కేంద్ర బడ్జెట్‌లో పురోగతి లేదని విజయసాయిరెడ్డి ఆక్షేపించారు.

నిరుత్సాహంగా ఉంది..

కేంద్ర బడ్జెట్​ రాష్ట్రానికి చాలా నిరుత్సాహంగా ఉందని ఎంపీ విథున్​ రెడ్డి అన్నారు. బడ్జెట్‌లో ప్రత్యేక హోదా, విభజన హామీల ప్రస్తావనే లేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చేలాగా కృషి చేస్తామని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి: 'వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ. 40వేల కోట్లు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.