విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని... అది అమలు కాకుండా అపడం ఎవరితరమూ కాదని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు. విశాఖలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... మీడియాతో మాట్లాడారు. రాజధాని తరలింపు అడ్డంకులపై అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ... భాజపా సంగతి తనకు తెలియదని, సుజనాచౌదరి మాత్రం తన భూములు పోతాయనే విశాఖను రాజధానిగా వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. దేశంలో మండలి రద్దు కోరుతూ... ఆంధ్రప్రదేశ్ మాత్రమే తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని వెల్లడించారు. ఆ అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ చూస్తున్నారని వివరించారు.
ఇదీ చదవండి:'కార్యాలయాలను తరలిస్తే ప్రభుత్వానిదే బాధ్యత'