ETV Bharat / city

విశాఖ ఉక్కుపై ఒడిశా పెత్తనం.. అఖిలపక్ష భేటీలో నేతలు - ఎంపీ విజయసాయిరెడ్డి తాజా వార్తలు

ఒడిశా నాయకులు, అధికారులపై ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై వారి పెత్తనం సాగుతోందని ఆరోపించారు. రాయ్‌బరేలీలో రైలు చక్రాల కర్మాగారం నిర్మాణానికి ఉక్కు కర్మాగారానికి చెందిన రూ.2 వేల కోట్లు తరలించారని అన్నారు. కీలక స్థానాల్లో ఉండి స్థానిక హక్కులను కాలరాస్తున్నారని వ్యాఖ్యానించారు.

mp vijaya sai reddy
mp vijaya sai reddy
author img

By

Published : Feb 12, 2021, 7:11 AM IST

విశాఖ ఉక్కు కర్మాగారంపై ఒడిశా నాయకులు, అధికారుల పెత్తనం సాగుతోందని వైకాపా ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆరోపించారు. గురువారం ఉక్కు కార్మికసంఘాల నాయకులు, వివిధ పార్టీల ప్రతినిధులతో విశాఖలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఉక్కు కర్మాగార కార్మిక సంఘాల ప్రతినిధులతో మాట్లాడితే చాలా విషయాలు తెలిశాయన్నారు. రాయ్‌బరేలీలో రైలు చక్రాల కర్మాగారం నిర్మాణానికి ఉక్కు కర్మాగారానికి చెందిన రూ.2వేల కోట్లు తరలించారని ఆరోపించారు.

ఒడిశాకు చెందిన ఓఎండీసీలో పదేళ్ల కిందట రూ.361 కోట్ల పెట్టుబడి పెడితే ఖనిజం రాకపోగా రూ.వెయ్యి కోట్లు అపరాధ రుసుము చెల్లించాల్సి వచ్చిందన్నారు. కర్మాగారంలోని టి.కె.చాంద్‌ అనే అధికారి కుంభకోణానికి పాల్పడి సంస్థకు రూ.2వేల కోట్ల నష్టం కలిగిస్తే ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఆ మూడు అంశాల్లోనే విశాఖ ఉక్కు నుంచి రూ.5,361 కోట్లు తరలిపోయాయన్నారు. అప్పుల్లో ఉన్న ఉక్కు కర్మాగారానికి కేంద్ర సహకారం కూడా లేదన్నారు.

ఆ శాఖలోనూ, స్టీలుప్లాంటులోనూ ఒడిశా వారే కీలక స్థానాల్లో ఉండి స్థానికుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. శుక్రవారం కేంద్ర హోంమంత్రిని కలుస్తామన్నారు. అన్నిపార్టీల ఎంపీలతో మాట్లాడి ప్రధానిని కలుస్తామన్నారు.కర్మాగార ప్రస్తుత పరిస్థితిని అవకాశంగా తీసుకుని కేంద్రంలో ఉన్న కొందరు పెద్దలు, పారిశ్రామికవేత్తలు, ప్రైవేటు వ్యక్తులు సంస్థను తీసుకోవాలని కుట్ర చేస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్రం రూ.1300 కోట్లకే విశాఖ ఉక్కును విక్రయిస్తే విశాఖలోని ప్రతి ఒక్కరూ సాయంచేసి ప్రజలే కొనుక్కొని నడిపితే బాగుంటుందన్నారు.

విశాఖపై ఒడిశా దాడి: ముత్తంశెట్టి

కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తూ విశాఖపై ఒడిశా దాడి చేస్తోందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు. పోస్కోను ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు తరిమికొట్టారని... ఆంధ్రవాళ్లు ఏమీ చేయరన్న చులకన భావంతో ఒడిశా నాయకులు విశాఖపై రుద్దాలని ప్రయత్నిస్తున్నారన్నారు.

కేంద్ర ఉక్కుశాఖ మంత్రి పచ్చి అబద్ధం చెప్పారు

పోస్కోతో ఒప్పందం జరగలేదని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ కార్మిక సంఘాల నాయకులతో పచ్చి అబద్ధం చెప్పారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నరసింగరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి ఆరోపించారు. ఉక్కు కర్మాగార ప్రతినిధులతో సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోమన్నారని గుర్తుచేశారు. సమావేశంలో ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, కార్మిక నేత మంత్రి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కు: బుద్దా వెంకన్న

‘స్టీలుప్లాంటు విషయంలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కైనట్లు స్పష్టంగా తెలుస్తోంది, రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇచ్చిన సమాధానంతో ఇది తేటతెల్లమైంది’ అని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.

* గాజువాక తెదేపా కార్యాలయ ఆవరణలో విశాఖ లోక్‌సభ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేపట్టిన నిరాహార దీక్ష గురువారం రెండోరోజుకు చేరుకుంది. అగనంపూడి సీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్‌ అశోక్‌ నేతృత్వంలోని వైద్యులు ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు.

అసెంబ్లీలో తీర్మానం చేయాలి: సీపీఐ

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. గురువారం కూర్మన్నపాలెం కూడలిలో సీపీఐ శ్రేణులు, ఉక్కు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో, ఉక్కు టీటీఐ కూడలిలో పరిశ్రమ ఎస్సీ, ఎస్టీ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఉక్కు ఏఐటీయూసీ కార్యాలయంలో కార్మిక సంఘాల సమావేశంలో సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వి.వి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, తెలుగువారి గుండెచప్పుడు దిల్లీ పెద్దలకు వినిపించేలా ఉద్యమించాలన్నారు.

ఇదీ చదవండి:

పల్లెపోరు రెండో విడతకు ముగిసిన ప్రచారం.. రేపే పోలింగ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.