ఆంధ్రప్రదేశ్‌కు అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్‌తో రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర విజయవంతం కావాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆకాంక్షించారు. పాదయాత్రలో రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. పాదయాత్రకు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. రుణ ఒప్పందాల్లో గవర్నర్ పేరు రాయడం దుర్మార్గమన్నారు. ‘విశాఖ ఉక్కు’ రక్షణ బాధ్యత నూటికి నూరుశాతం వైకాపాదేనని, స్టీల్ ప్లాంట్ కోసం సీఎం జగన్ ఒక్కసారైనా నిరసన తెలిపారా? అని ప్రశ్నించారు.
శాసనమండలిని రద్దు చేయాలని శాసనసభలో తీర్మానం చేశారనీ.. కానీ ఇప్పుడేమో మండలిలో ఖాళీలు భర్తీ చేయాలంటూ దిల్లీలో బతిమిలాడుతున్నారని ఆక్షేపించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీపై ఉన్న శ్రద్ధ విశాఖ ఉక్కుపై ఎందుకు లేదని రఘురామ ప్రశ్నించారు. విశాఖ ఉక్కుపై తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ప్లకార్డులు చూపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: