రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకత గురించి మాటల్లో చెప్పడమే తప్ప ఆచరణలో లేదని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. భూముల అమ్మకాలు సహా.. అనేక అంశాలపై విడుదల చేయాల్సిన ప్రభుత్వం ఉత్తర్వులను రహస్యంగా పెట్టి.. సెల్ ఏపీ పథకాన్ని తమ ప్రభుత్వం తీసుకోచ్చిందని రఘురామ అన్నారు. పారదర్శకత గురించి మాట్లాడే సీఎం జగన్ జీవోలను బహిర్గతం చేయకపోవడంపై వ్యంగ్యంగా స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడ కావాలంటే అక్కడ భూములను అమ్మడానికి వీలుగా.. కొత్త జీవోలను తీసుకొస్తున్నారని అన్నారు. ప్రజల ఆస్తులను అమ్మేస్తున్నారన్న రఘురామ.. ప్రభుత్వ ఆస్తులను అమ్మే విధానానికి స్వస్తి పలకాలని హితవు పలికారు.
విజయసాయి భూ దందాలపై ఆధారాలున్నాయ్..
విశాఖపట్నంలో భూ దందాలు జరుగుతున్నాయనడంలో సందేహం లేదని.. తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డే.. భూ దందాలు చేస్తున్నారనేది బహిరంగమే అని నర్సాపురం ఎంపీ పేర్కొన్నారు. దీనకి సంబంధించి తనకు చాలా మంది ఫోన్ చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం కమిషనర్ అడిగితే వివరాలు ఇవ్వడానికి తాను సిద్దంగా ఉన్నానని.. చట్టపరంగా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని అన్నారు.
ప్రభుత్వంపై అసంతృప్తిలో ప్రజలు..
రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై దూషణలు, బూతులు మాట్లాడకూడదని.. తమ పార్టీ నేతలు గుర్తించి ఉంటారని, అందుకని, అలా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకునే విధంగా చట్టాలు చేయాలని రాష్ట్రపతిని కలిసి కోరడం మంచిదే అని వ్యాఖ్యానించారు. బద్వేల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకపోవడం కారణంగానే మెజారిటీ పెరిగిందన్న రఘురామ.. దళిత బంధు పథకం హుజూరాబాద్‌లో పని చేయలేదని, అధికార పార్టీకి ఓట్లు పడలేదన్నారు. రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులు తర్వలోనే వస్తాయన్న ఆయన.. ఇండియా టుడే సర్వే లో 81 శాతం మంది రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం పై అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు.
ఇదీ చదవండి: