సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. సీపీఎస్ విధానం రద్దు అంశంపై లేఖలో ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్రలో... సీపీఎస్ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చారని జగన్‌కు గుర్తు చేశారు. ఆ హామీకి నాడు ఉద్యోగుల నుంచి మద్దతు లభించిందని చెప్పారు.
" అధికారంలోకి వచ్చిన 7 రోజుల్లో హామీ నెరవేరుస్తానన్నారు. అధికారంలోకి వచ్చి 765 రోజులు దాటినా హామీ నెరవేరలేదు. సీపీఎస్ విధానం రద్దు చేస్తానన్న హామీ వెంటనే నిలబెట్టుకోవాలి" అని లేఖలో రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
Curfew in AP: రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు!