వచ్చే నెలలో తన నియోజకవర్గంలో ప్రధాన మంత్రి మోదీ పర్యటించనున్న నేపథ్యంలో.. అక్కడి కార్యక్రమంలో హాజరు కావాలనుకుంటున్న తనకు తగిన భద్రత కల్పించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు.. కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్, హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను కలిశారు.
విశాఖపట్నంలో పర్యటిస్తున్న పార్లమెంటరీ స్థాయి సంఘంలో తాను ఉన్నప్పటికీ.. స్థానిక అధికారుల బెదిరింపుల కారణంగా హజరుకాలేకపోతున్నట్లు రఘురామ.. వారి దృష్టికి తీసుకెళ్లారు. రెండేళ్లుగా రాష్ట్రానికి, తన సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టిస్తోందని.. ఇప్పుడు పార్లమెంటు స్థాయి సంఘం పర్యటనకు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. వచ్చే నెల 4న ప్రధాని తన నియోజకవర్గ పర్యటనకు రానున్న నేపథ్యంలో... తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉన్నందున.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. తగిన భద్రత కల్పించాలని హోంశాఖ సహాయ మంత్రి, కార్యదర్శిలను విడివిడిగా కలిసి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: