MP Raghurama fired on AP Govt : ఉద్యోగులు గొంతు విప్పి వారి సమస్యలపై మాట్లాడుతున్నారు తప్ప.. గొంతెమ్మ కోర్కెలేమీ కోరడం లేదన్నారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. ఉద్యోగులంతా కలిసి కట్టుగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగులకు ప్రజల సంపూర్ణ మద్దతో పాటుగా.. న్యాయం ధర్మం కూడా వారి వైపే ఉందన్నారు. అమరావతి రాజధాని అంశం గురించి హైకోర్టులో వాదనలు జరిగాయన్న ఆయన.. అమరావతి విషయంలో ప్రభుత్వం మోసం చేసిందన్నారు. 6 కోట్లు ఇచ్చి బొట్సన్ కంపెనీ దగ్గర దొంగ రిపోర్టులు తెప్పించారనే అభిప్రాయం వ్యక్తం చెశారు. మూడు రాజధానులను తీసుకొచ్చే హక్కు ప్రభుత్వానికి లేదన్న రఘురామ... ప్రజల్ని అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపా కార్యనిర్వాహక కార్యదర్శి శివశంకర్ రెడ్డి తరపున ప్రభుత్వ న్యాయవాది చంద్ర ఓబుల్ రెడ్డి ఎలా వాదనలు వినిపిస్తారని ప్రశ్నించారు. ఓబుల్‌రెడ్డిపై బార్ కౌన్సిల్ చైర్మన్ కి లేఖ రాసినట్లు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో వైకాపా శ్రేణులే ఆగ్రహజ్వాలలతో ఉన్నారని రఘురామ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ మాదక ద్రవ్యాలు దొరికినా... రాష్ట్రానికి సంబంధాలు ఉన్నట్లు బయటపడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ తరహాలో... జగన్ కూడా మాదక ద్రవ్యాల వ్యవహారాలపై సమీక్షించి కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదీ చదవండి : సమ్మెదిశగా ఉద్యోగుల అడుగులు... ఎస్మా ప్రయోగించేందుకు ప్రభుత్వం సమాయత్తం
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!