ETV Bharat / city

తిరుమలలో అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే..!: ఎంపీ రఘురామకృష్ణరాజు

తిరుమలలో అన్యమతస్థులకు డిక్లరేషన్‌ తప్పనిసరి అని... ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసే అధికారం తితిదే చైర్మన్‌కు లేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.

MP Raghuram Krishnaraja
ఎంపీ రఘురామకృష్ణరాజు
author img

By

Published : Sep 20, 2020, 2:45 PM IST

హిందూ ఆలయాలపై దాడులను వ్యతిరేకిస్తూ..నల్ల బ్యాడ్జి ధరించి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటానని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దాడులపై సీబీఐ విచారణ కోరితే తమ పార్టీ వాళ్లే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తితిదే వీవీఐపీలకు మాత్రమే డిక్లరేషన్ విధానం ఉందని... గత జీవో రద్దు చేయకుండా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని ఎంపీ అన్నారు. ప్రభుత్వ జీవోను రద్దు చేసే అధికారం తితిదే ఛైర్మన్‌కు లేదని... సీఎం తిరుమల వెళ్లినపుడు డిక్లరేషన్ ఇవ్వాలని కోరారు.

పార్టీ బహిష్కరించినా ప్రజలు బహిష్కరించలేదని... తననొక వారధిగా భావిస్తున్నారని ఎంపీ అన్నారు. ఒకట్రెండు నెలల్లో పార్టీ నుంచి బహిష్కరిస్తారని అనుకుంటున్నానని...తనపై అనర్హత వేటు వేయించడం సాధ్యం కాదని తెలిపారు.

ఇదీ చదవండి: హిందూ సంప్రదాయాలను వైకాపా మంటగలుపుతోంది: కళా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.