ఏపీ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందని ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆక్షేపించారు. ఏపీలో అవకతవకలు, జరగకూడని తప్పులు జరిగాయన్నారు. ఇదే విధంగా అభివృద్ధిని పక్కనపెట్టి ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తే.. భావితరాలకు తీరని నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల విషయంలో నిబంధనల ఉల్లంఘన అంశాన్ని ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
‘‘తప్పులు చేయకుండా అప్పులు చేయాలి. గతంలో సీఎం ఆర్థిక సలహాదారు కృష్ణ, ఆర్థిక మంత్రి బుగ్గన సీఎంకు ఇదే విషయం చెప్పారు. దాన్నే నేను మరోసారి గుర్తు చేస్తున్నాను’’ అని రఘురామ వెల్లడించారు.
ఇదీ చదవండి: