ETV Bharat / city

నన్ను చంపేందుకు కుట్ర: ఎంపీ రఘురామకృష్ణరాజు - ఏపీ తాజా వార్తలు

రాజద్రోహం కేసులో అరెస్టైన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. తనను చంపేందుకు ప్రభుత్వం కుట్ర చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. సీఐడీ అధికారి సునీల్‌ సైతం.. తనను కొట్టినవారిలో ఉన్నారని.. అనుమానం వ్యక్తం చేశారు. హైడ్రామా నడుమ గుంటూరు నుంచి సికింద్రాబాద్‌లోని సైనిక ఆస్పత్రికి చేరిన ఆయనకు వైద్యులు ఇవాళ పూర్తిస్థాయి పరీక్షలు చేయనున్నారు.

mp raghu rama arrest
ఎంపీ రఘురామకృష్ణరాజు
author img

By

Published : May 18, 2021, 4:15 AM IST

Updated : May 18, 2021, 7:18 AM IST

రాజద్రోహం సహా పలు అభియోగాలపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్‌లోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. జైలు నుంచి రఘురామను సొంత వాహనంలోనే తీసుకెళ్లారు. ఈ క్రమంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

నన్ను చంపేందుకు కుట్ర: ఎంపీ రఘురామకృష్ణరాజు

రఘురామను వెంటనే సికింద్రాబాద్‌లోని సైనిక ఆస్పత్రికి తరలించాలని.. సుప్రీంకోర్టు సోమవారం మధ్యాహ్నమే ఆదేశించింది. అమలు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పగించగా జాప్యం చేశారని.. ఎంపీ భార్యతో పాటు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సీఎస్‌కు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు వారు తెలిపారు. కాసేపటికే సుప్రీంకోర్టు తీర్పు ప్రతులు సీఎస్‌ ద్వారా గుంటూరు జిల్లా కలెక్టర్‌కు అందాయి. కలెక్టర్ ఆ సమాచారాన్ని జైలు అధికారులకు పంపించారు. కాసేపటికి.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎంపీ రఘురామను గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్‌ మిలటరీ ఆసుపత్రికి తరలించారు.

సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు ప్రత్యేక ఎస్కార్ట్ వాహానంలో ఏపీ సీఐడీ అధికారులు సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రికి రఘురామతో బయల్దేరారు. రాత్రి 11 గంటలకు ఆస్పత్రికి చేరుకున్నారు. మిలటరీ నిబంధనల ప్రకారం ఆసుపత్రి ఎదుట ప్రత్యేక అంబులెన్స్‌ను ఆర్మీ అధికారులు ఏర్పాటు చేశారు. ఎస్కార్ట్‌ వాహానాల శ్రేణిని ఆసుపత్రి ఎదుటే నిలిపివేసి ప్రత్యేక అంబులెన్స్‌ వాహనంలో లోపలికి తీసుకెళ్లారు. ఎస్కార్ట్‌ వాహనం నుంచి దిగిన ఆయన.. దూరం నుంచే కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

మరోవైపు.. సుప్రీం కోర్టు ఆదేశానుసారం తెలంగాణ హైకోర్టు న్యాయాధికారి.. అప్పటికే మిలటరీ ఆసుపత్రికి వచ్చారు. రఘురామకు రాత్రే ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇవాళ ముగ్గురు సభ్యులతో కూడిన వైద్యబృందం పర్యవేక్షణతో పాటు విచారణ చేపట్టనుంది. వీటిని వీడియో రికార్డు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీడియోను సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని తెలిపింది. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రఘురామకృష్ణరాజు మిలటరీ ఆసుపత్రిలోనే ఉండనున్నారు.

'ఆయన కూడా ఉన్నారు..'

తనను విచారణ పేరుతో దారుణంగా ముసుగులు వేసుకుని కొట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఆ ముసుగులో డీజీ సునీల్‌కుమార్‌ సైతం ఉన్నారనే అనుమానం వ్యక్తం చేశారు. తనను చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

మిలిటరీ ఆస్పత్రికి ఎంపీ రఘురామ.. నేడు పూర్తిస్థాయి వైద్యపరీక్షలు

Last Updated : May 18, 2021, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.