మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సమాచారం ఇచ్చే వారికి ప్రాణ భయం తప్పక ఉంటుందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. సీబీఐ ప్రకటించిన ఐదు లక్షల రూపాయల రివార్డు.. ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు. సమాచారం అందించే వారికి కోటి రూపాయల రివార్డు ఇవ్వాలని సూచించారు. సత్వర విచారణలో భాగంగానే సీబీఐ రివార్డు ప్రకటించి ఉంటుందని అభిప్రాయపడ్డారు. వివేకా హత్య కేసులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
'కేసు సత్వర విచారణలో భాగంగానే సీబీఐ రివార్డు ప్రకటించి ఉంటుంది. వివేకా హత్య కేసులో సమాచారమిచ్చే వారికి ప్రాణ భయం తప్పదు. సమాచారం అందించే వారికి రూ. కోటి రివార్డు ఇవ్వాలి. వివేకా హత్య కేసులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా'- రఘురామకృష్ణరాజు, నర్సాపురం ఎంపీ
సీబీఐ ప్రకటనలో ఏముందంటే..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక ప్రకటన చేసింది. కేసుకు సంబంధించి సమాచారం అందిస్తే రివార్డు ఇస్తామని పత్రికా ప్రకటన ఇచ్చింది. కచ్చితమైన, నమ్మదగిన సమాచారం ఇస్తే రూ.5 లక్షలు అందజేస్తామని స్పష్టం చేసింది. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీబీఐ అధికారులు వెల్లడించారు. వారు ఫోన్ నంబర్ల ద్వారా కానీ, కార్యాలయంలో గానీ తమను సంప్రదించవచ్చని తెలిపారు.
దాదాపు ఏడాది నుంచి ఈ కేసుపై విచారణ చేస్తున్న సీబీఐ అనేక మంది అనుమానితులను ఇప్పటికే పలు దఫాలు ప్రశ్నించింది. మూడు నెలల కిందట నాలుగో దఫా విచారణ చేపట్టిన సీబీఐ.. వరుసగా 76 రోజుల నుంచి విచారణ జరుపుతోంది. ఈ హత్య కేసులో స్పష్టమైన ఆధారాలు సేకరించాల్సి ఉన్నందున.. నమ్మకమైన సమాచారం ఎవరి దగ్గరైనా ఉంటే దాన్ని సేకరించేందుకు సీబీఐ ఈ ప్రకటన ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:
YS viveka murder case: 76వ రోజు విచారణ.. సమాచారమిస్తే రివార్డు ఇస్తామని సీబీఐ ప్రకటన
Pak Taliban: 'భారత్‌కు చెక్ పెట్టేందుకు అఫ్గాన్‌తో పాక్ వ్యూహాత్మక అడుగులు'