ముఖ్యమంత్రి సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు ఏడో లేఖ రాశారు. రైతు భరోసా అంశంపై లేఖలో పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఎన్నికల్లో రైతులు పెద్దఎత్తున వైకాపాకు అండగా నిలిచారని రఘురామ గుర్తు చేశారు.
రూ.12,500 నుంచి రూ.13,500కు పెంచుతామని హామీ ఇచ్చారని.. రూ.13,500తో పాటు కేంద్రం ఇచ్చే రూ.6వేలు కలిపి రూ.19,500 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు.
ఇదీ చదవండి: