ETV Bharat / city

లోకసభ స్పీకర్ ఓం బిర్లాతో... ఎంపీ రఘురామకృష్ణ రాజు భేటీ - ఎంపీ రఘురామకృష్ణ రాజు తాజా వార్తలు

లోకసభ స్పీకర్ ఓం బిర్లాతో ఎంపీ రఘురామకృష్ణ రాజు భేటీ అయ్యారు. తన అరెస్ట్, తదనంతర పరిణామాలను ఎంపీ... స్పీకర్​కు వివరించారు

లోకసభ స్పీకర్ ఓం బిర్లాతో... ఎంపీ రఘురామకృష్ణ రాజు భేటీ

author img

By

Published : Jun 3, 2021, 4:20 AM IST

ఏపీ సీబీసీఐడీ పోలీసులపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. బుధవారం రాత్రి సభాపతిని కలిసిన ఆయన తనను అరెస్టు చేసి, కస్టడీలో పోలీసులు ప్రవర్తించిన తీరును వివరించారు. కాలికి అయిన గాయాలను చూపించారు. అరెస్టు తదనంతర పరిణామాలపై ఓం బిర్లాకు లేఖ అందించారు. ఈ ఘటనలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏఎస్పీ విజయపాల్, సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని సభాపతిని కోరారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజు తాను మాట్లాడేందుకు అరగంట సమయం ఇవ్వాలని రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

CM Jagan Review: భూరక్ష పథకం చురుగ్గా ముందుకు సాగాలి: ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.