భారతీయ భాషల విశ్వవిద్యాలయాలను మార్చడానికి ఏర్పాటు చేసిన కమిటీలో ఒక్క తెలుగు వారు కూడా లేరని రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తప్పుబట్టారు. ఈ విషయాన్ని రాజ్యసభలో కనకమేడల తెలుగులో తన వాణీని వినిపించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంలో భాగంగా నెల్లూరులోని ప్రాంతీయ విశ్వవిద్యాలయం అభివృద్ధి కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాచీన భాషీయ కేంద్రాలను భారతీయ భాషల విశ్వవిద్యాలయాల్లో కలిపే విషయంపై.. సూచనల కోసం భారత ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. పెట్రోల్ రేట్లపై ప్రతిపక్షాలు నిరసనలు తెలియజేస్తుండగానే.. కనక మేడల తన ప్రసంగాన్ని ముగించారు.
ఇదీ చదవండి: ఉద్రిక్తంగా మారిన విశాఖ ఉక్కు ఉద్యమం