ఆ వ్యక్తిని చూస్తుంటే...ఏ మంత్రో... ఏ ఎమ్మెల్యేనో అనుకుంటున్నారా...! హీరోలా స్టైల్‌గా కనిపిస్తారు. చూస్తే వీఐపీనో అనుకుంటే పొరపాటే... అతనో సాధారణ వ్యక్తి. పేరు అల్లుడు జగన్. తెరాస రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ గన్మెన్లతో ఈయన చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అల్లుడు జగన్... పులిచింతల ప్రాజెక్టు సందర్శించినప్పుడు ఈ వీడియోలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఎంపీ భద్రతను గన్‌మెన్ గాలికొదిలేసి ఇలా వీడియోల్లో ఫోజులిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చూడండి: పండుగ సీజన్లో షియోమీ 'ఆఫ్‌లైన్' అదుర్స్..