Model Suicide: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఓ మోడల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయ్‌నగర్ కాలనీకి చెందిన అమైరా ఖాన్(23).. మోడలింగ్ చేస్తూ జీవనం సాగిస్తోంది. గత కొంత కాలంగా తల్లిదండ్రులకు దూరంగా.. చింతల్మెట్లోని మొఘల్ మెడోస్ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటోంది. జనవరి 7న అమైరాఖాన్ పుట్టినరోజు సందర్భంగా.. తన ఇంట్లోనే స్నేహితులతో కలిసి బర్త్‌డే వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఆ మరుసటి రోజు నుంచి అమైరాఖాన్ తన ఫ్లాట్ నుంచి బయటకు రాలేదు.
కొన్ని రోజుల తర్వాత అమైరాఖాన్ ఇంటి నుంచి దుర్వాసన రావటాన్ని గమనించిన అపార్ట్‌మెంట్‌వాసులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. తీరా చూస్తే.. అమైరాఖాన్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. శరీరమంతా ఉబ్బి.. కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఘటనాస్థలిని రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, సీఐ కనకయ్య పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమైరాఖాన్.. తన స్నేహితుడు ఇమ్రాన్‌ఖాన్‌తో కలిసి గత కొంతకాలంగా సహజీవనం సాగిస్తోందన్న అనుమానంతో.. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చూడండి: