హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కా.యి. దాదాపు 15 నెలల తర్వాత ఎంఎంటీఎస్(MMTS) సేవలు అందుబాటులోకి వచ్చాయి. 10 రైళ్లు సేవలు అందిస్తాయని దక్షిణ మధ్య రైల్వే(south central railway) ప్రకటించింది. ఉదయం 7.50 నుంచి రాత్రి 7.05 గం. వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. విద్యార్థులకు సంబంధించి పాస్‌లు పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రైళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.
సుదీర్ఘ కాలం తర్వాత ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతేడాది మార్చి 23న నిలిచిన ఎంఎంటీఎస్(MMTS) సేవలను.. నేటి నుంచి పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికుల రద్దీని బట్టి క్రమంగా సర్వీసులు పెంచుతామని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.
2003 ఆగస్టులో ప్రారంభమైన ఎంఎంటీఎస్ రైళ్లు గతేడాది... మార్చి 23 వరకు నిరంతరాయంగా సేవలందించాయి. అలాంటిది కరోనా లాక్డౌన్(Lockdown) దెబ్బకు 15 నెలలుగా షెడ్డుకే పరిమితం కాగా... కొవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో నేటి నుంచి(జూన్ 23) పునరుద్ధరిస్తున్నారు.
ఎంఎంటీఎస్ రైళ్లు సికింద్రాబాద్-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి మధ్య 29 కిలోమీటర్ల మేర 2003 నుంచి నిరంతరం సేవలందిస్తున్నాయి. 15 కిలోమీటర్ల సికింద్రాబాద్-ఫలక్నుమా సెక్షన్ ఫిబ్రవరి 2014లో ప్రారంభమైంది. జంట నగరాల్లో మొత్తం 26 స్టేషన్లలో ఎంఎంటీఎస్(MMTS) రైళ్లు సేవలందిస్తున్నాయి. ప్రారంభంలో 48 సర్వీసులు, 6 కోచ్‌లు 13వేలమంది ప్రయాణికులతో ప్రారంభమైన ఎంఎంటీఎస్ ప్రస్తుతం 121 సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే(south central railway) అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇదీ చూడండి: