హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 89 మంది ఎలిమినేట్ అయ్యారు. తెరాస అభ్యర్థి వాణీదేవికి 6,930 ఎలిమినేషన్ ఓట్లు, భాజపా అభ్యర్థి రాంచందర్‌రావుకు 5,832 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొ.నాగేశ్వర్‌కు 6,038 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 5,172 ఎలిమినేషన్ ఓట్లు బదిలీ అయ్యాయి.
వాణీదేవి భాజపా అభ్యర్థి రాంచందర్‌రావుపై 9,119 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తంగా వాణీదేవికి 1,19,619, ఓట్లు, రాంచందర్‌రావుకు 1,10,500 ఓట్లు, ప్రొ.నాగేశ్వర్‌కు 59,648 ఓట్లు, చిన్నారెడ్డికి 36,726 ఓట్లు వచ్చాయి. ఇక్కడ విజయం సాధించాలంటే 1,68,520 ఓట్లు రావాలి.
ఇదీ చూడండి. తెలంగాణ: నాలుగో రోజు కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు