ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఇటీవల ఖాళీఅయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది. ఫిబ్రవరి 25న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుండగా.. నామినేషన్ల దాఖలుకు మార్చి 4 గడువు విధించింది. మార్చి 8 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా.. మార్చి 15వతేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు మార్చి సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు.
తెలుగుదేశం నేతలు తిప్పేస్వామి, గుమ్మడి సంధ్యారాణి, వట్టికూటి వీరవెంకన్న చౌదరితోపాటు వైకాపా నేత మహ్మద్ ఇక్బాల్ పదవీ కాలం పూర్తవడంతో నాలుగు ఖాళీలు ఏర్పడ్డాయి. ఇక వైకాపా నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైకాపా నేత చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో చనిపోయారు. మొత్తంగా 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
ఇదీ చదవండి: టెడ్ లేకనే.. అవి చనిపోతున్నాయి..!