లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగంపై తనపై కేసు నమోదు చేశారని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో భౌతిక దూరం పాటించలేదని పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించినందుకు ఎమ్మెల్యేతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ చర్యకు నిరసనగా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించిన ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. తనపై కేసు పెట్టినందుకు ఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: