ETV Bharat / city

Balakrishna Deeksha: హిందూపురంలో బాలయ్య మౌనదీక్ష ప్రారంభం - mla balakrishna deeksha

Balakrishna Deeksha at Hindupuram: హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్​తో హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మౌన దీక్ష ప్రారంభమైంది. అంతకుముందు బాలయ్యని నిర్వహించిన ర్వాలీలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.

హిందూపురంలో బాలయ్య మౌనదీక్ష ప్రారంభం
హిందూపురంలో బాలయ్య మౌనదీక్ష ప్రారంభం
author img

By

Published : Feb 4, 2022, 10:38 AM IST

Updated : Feb 4, 2022, 12:23 PM IST

Balakrishna Deeksha: హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు మౌన దీక్ష ప్రారంభమైంది. హిందూపురంలో పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి ర్యాలీగా తరలివెళ్లిన బాలకృష్ణ.. అంబేడ్కర్ విగ్రహం మౌన దీక్ష చేపట్టారు. దీక్షా స్థలానికి బాలయ్య అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా చేరుకున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని నినాదాలు స్థానికంగా మార్మోగుతున్నాయి. అంతకుముందు సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ఏర్పాటు చేయాలంటూ బాలకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బాలకృష్ణ వెంట భారీగా పార్టీ శ్రేణులతోపాటు అఖిలపక్ష సభ్యులు , విద్యార్థులు, యువకులు తరలివచ్చారు. పార్టీలకు అతీతంగా బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ నినదించారు. ఉద్యమ కార్యాచరణపై సాయంత్రం అఖిలపక్ష నేతలతో బాలకృష్ణ చర్చించనున్నారు.

బాలకృష్ణ నివాసం వద్ద సందడి

బాలకృష్ణ నివాసం వద్ద కార్యకర్తలు, నాయకులు, అభిమానుల తాకిడితో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలిండియా ఎన్​బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్​ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే మౌనదీక్షకు బయలుదేరి వెళ్లనున్నారు.

ఇదీ చదవండి..

BALAKRISHNA: కదనరంగంలో బాలయ్య.. వారికి మద్దతుగా నేడు మౌన దీక్ష

Last Updated : Feb 4, 2022, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.