కరోనా నివారణకు ఆత్మ ధైర్యం ఎంతో ముఖ్యమని మంగళగిరి ఎమ్మెల్యే అళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న గుండిమెడ కరోనా క్వారంటైన్ సెంటర్ను ఆయన పరిశీలించారు. వైరస్ బారిన పడిన రోగులను పరామర్శించారు. భోజన, ఇతర సదుపాయాల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్, మందుల గురించి వైద్యులను ఆరా తీయగా.. నర్సుల కొరత ఉందని వైద్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే ఫోన్లో ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన .. నర్సులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: