తెదేపా కార్యాలయ నిర్మాణం కోసం గుంటూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన భూమి కేటాయింపులో నిబంధనలు ఉల్లంఘించారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాది అల్లంకి రమేష్ గురువారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆత్మకూరు పరిధిలోని వాగు పోరంబోకునకు చెందిన 3 ఎకరాల 65 సెంట్ల భూమిని 99 ఏళ్ల పాటు లీజుకి కేటాయిస్తూ జూన్ 2017లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 228 జారీ చేసింది.
సీఆర్డీఏ చట్టం నిబంధనలు ఉల్లంఘించారని, నీటివనరులతో సంబంధం ఉన్న భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేశారని ఆళ్ల పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని.. అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి అభ్యర్థించారు.
ఇదీ చదవండి:
ఆర్థిక వనరుల సమీకరణకు ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు