తెలంగాణ మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్ ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో తేనీటి విందు అనంతరం ఖానాపురంలో మినీ ట్యాంక్‌బండ్, బల్లేపల్లి వైకుంఠధామాన్ని ప్రారంభించారు. లాకారం ట్యాంక్‌బండ్‌పై మాజీ ప్రధాని పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. రూ.1.25 కోట్లతో పీవీ విగ్రహం ఏర్పాటు చేశారు. అనంతరం పీవీ శతజయంతి సంకలనం పుస్తకాన్ని కేటీఆర్, ఇతర మంత్రులు ఆవిష్కరించారు.
కేంద్రానికి నిబద్ధత, చిత్తశుద్ధి ఉంటే భారతరత్న ప్రకటించాలి. పీవీకి భారతరత్న ఇవ్వడమంటే కేంద్రం తనను తాను గౌరవించుకోవడమే. రాష్ట్ర ప్రజల కోరికా అదే. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో పీవీ కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరాం.
- కేటీఆర్
కాసేపట్లో ఐటీ సౌధం సహా ధంసలాపురం రైల్వే వంతెన, పోలీస్ కమిషనరేట్ నూతన భవనం, పలుచోట్ల పార్కులు, పట్టణ ప్రకృతి వనాలు ప్రారంభించనున్నారు. అనంతరం ఐటీ హబ్ ప్రాంగణంలో బహిరంగ సభలో మంత్రులు పాల్గొంటారు.