ETV Bharat / city

'అక్రమ మైనింగ్​పై కఠిన చర్యలు తీసుకోండి' - మంత్రులు బుగ్గన పెద్దిరెడ్డి మైనింగ్​పై సమీక్ష అప్​డేట్స్

ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన మైనింగ్ అధికారులతో సమావేశమయ్యారు. అక్రమ మైనింగ్​పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

govt
మంత్రుల సమావేశం
author img

By

Published : Apr 28, 2021, 2:06 PM IST

మైనింగ్ అధికారులతో రాష్ట్ర గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మైనింగ్ ఆదాయన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా మైనింగ్ అనుమతులు ఇవ్వాలని మంత్రులు అధికారులకు స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

కరోనా సమయంలో స్కిల్డ్ లేబర్ వలస వెళ్ళకుండా జాగ్రతలు తీసుకోవాలని అన్నారు. గత ఏడాది కరోనా సంక్షోభంలోనూ 81 శాతం ఆదాయం ఉందన్న అధికారులు.. ఈ ఏడాది మైనింగ్ ఆదాయం రూ.4వేల కోట్లు వస్తుందని అంచనా వేసినట్లు మంత్రులకు తెలిపారు. గత ఏడాది 10,736 కేసుల్లో రూ.42.66 కోట్లు జరిమానా వసూలు అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఈ సమీక్షకు ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్. గుల్జార్, డీఎంజీ వెంకటరెడ్డి హాజరయ్యారు.

ఇదీ చదవండి: కార్పొరేటర్​ని కొట్టిన యువకుడు.. చితకబాదిన అనుచరులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.