సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 163 కేర్ టేకర్ల ఉద్యోగ నియామకాలు పూర్తి చేసినట్లు... ఆ శాఖ మంత్రి విశ్వరూప్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. దేశ చరిత్రలో ఎక్కడా విధంగా... 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 21 ప్రిన్సిపల్, 163 మంది కేర్ టేకర్ల పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. సొసైటీ ప్రారంభించిన 33ఏళ్ల తర్వాత మొట్టమొదటిగా... కేర్ టేకర్లను నియమించామన్నారు. సీఎం ఆదేశాల మేరకు పూర్తి పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 552 టీజీటీ పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామన్నారు.
ఇదీ చదవండి :'ఆంగ్ల మాధ్యమం' అమలుకు జీవో జారీ