AP TET 2024 Results : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (Teacher Eligibility Test) ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్షకి సంబంధించిన ఫైనల్ కీని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో టెట్ ఫైనల్ కీని ఉంచారు. ఆక్టోబర్ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలను పాఠశాల విద్యాశాఖ నిర్వహించింది. తొలి కీ విడుదల తర్వాత అభ్యర్థుల అభ్యంతరాలు తీసుకొని, అభ్యర్థుల అభ్యంతరాలు అన్నింటినీ పరిశీలించాకే తుది కీ విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు తెలిపారు. టెట్‌కు డీఎస్సీలో 20% వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే.
AP TET RESULT DATE : ఇక ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (Andhra Pradesh TET 2024) ఫలితాలను పాఠశాల విద్యా శాఖ ప్రకటించనుంది. అధికారిక వెబ్‌సైట్‌లో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం (AP TET Schedule), ఏపీ టెట్ ఫలితాలు నవంబర్ 2వ తేదీన విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఫలితాలు విడుదలైన అనంతరం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://aptet.apcfss.in ని సందర్శించి, సంబంధిత వివరాలను ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
HOW TO CHECK TET RESULTS : ఏపీ టెట్ అక్టోబర్ 3 నుంచి 21 వరకు పలు సెషన్లలో నిర్వహించారు. అభ్యర్థులు టెట్ ఫలితాలను ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు.
- ఏపీ టెట్ అధికారిక వెబ్‌సైట్ https://aptet.apcfss.in ను ఓపెన్ చేసుకోవాలి
- హోమ్ పేజీలో, ‘AP TET 2024 Results’ అనే లింక్‌పై క్లిక్ చేయాలి
- దానిపై క్లిక్ చేసిన తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది
- అక్కడ అడిగిన వివరాలను ఎంటర్ చేసి, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి
- వెంటనే అభ్యర్థుల టెట్ రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
- అనంతరం మీ రిజల్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, అదే విధంగా దీనిని ప్రింట్‌అవుట్‌ని తీసుకుని ఉంచుకోవడం ఉత్తమం.
ఏపీ టెట్ ఫలితాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం అభ్యర్థులు పాఠశాల విద్యా శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.