విజయవాడ నగర శివారు భవానీపురంలోని బీసీ సంక్షేమ శాఖ భవనంలో.. నూతనంగా ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ల కార్యాలయాలను ఆ శాఖ మంత్రి వేణు గోపాలకృష్ణ సందర్శించారు. త్వరలో ఏర్పాటు చేయనున్న 56 కార్పొరేషన్ల ఛైర్మన్ కార్యాలయాలు, వారికి కేటాయించిన సామాగ్రి, ఇతర సౌకర్యాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాలకు చెందిన 139 కులాలను గుర్తించి.. వారి అభివృద్ధి కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఏలూరు సభలో సీఎం జగన్ ఇచ్చిన హామీలో భాగంగా వీటిని నెలకొల్పామన్నారు. సంక్షేమ పథకాల ఫలాలు బీసీలకు చేరేందుకు ఈ కార్పొరేషన్లు కృషిచేస్తాయన్నారు. ఛైర్మన్ల నియామకాలపై అనేకమంది విమర్శలు చేయగా.. వాటిని తిప్పికొట్టేలా కార్యాలయాలు కేటాయించడం అభినందనీయమన్నారు.
ఇదీ చదవండి: తిరుపతి ఉపఎన్నిక వైకాపా పతనానికి నాంది కావాలి: చంద్రబాబు